హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

30 ఏళ్ల చరిత్రకు తెర.. ముప్పలకుంటలో స్వతంత్రుడి విజయం

ATP: బ్రహ్మసముద్రం మండలం ముప్పలకుంటలో స్వతంత్ర అభ్యర్థి చాపిరి జనార్దన్ బాబు 50 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత 30 ఏళ్ల ఎన్నికల చరిత్రలో స్వతంత్ర అభ్యర్థి గెలవడం ఇదే తొలిసారి. గ్రామస్తుల ఐకమత్యం, ప్రజల ఆదరణే తన విజయానికి కారణమని జనార్దన్ బాబు తెలిపారు. మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. విజయంతో గ్రామంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.