హైదరాబాద్: 28°C
క్రీడలు

బంతితో చెలరేగిన సెహ్వాగ్ చిన్న కుమారుడు

సెహ్వాగ్‌ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ U-19 ఆసియా కప్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిన్న కుమారుడు వేదాంత్ సెహ్వాగ్ బంతితో చెలరేగాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతున్న వేదాంత్.. 22 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఇలా ఒకరు బ్యాటింగ్‌లో, మరొకరు బౌలింగ్‌లో రాణిస్తూ 'తండ్రికి తగ్గ తనయులు' అని నిరూపించుకుంటున్నారు.