హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి'

SRPT: హుజూర్నగర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో చిన్న లోపాలు ఉన్నా వెంటనే సరిదిద్ది, మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. ఇళ్లతో పాటు పైలాన్, డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. పర్యటనలో హౌసింగ్ పీడీ జబ్బర్, ఆర్డీఓ శ్రీనివాసులు, కమిషనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.