హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెరికల్చర్ కేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

RR: తలకొండపల్లి మండలం కోరింతకుంట తండాలోని సెరికల్చర్ రిసోర్సెస్ సెంటర్‌ను మహేశ్వరం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా రిసోర్స్ హెడ్ శక్రు పట్టుపురుగుల పెంపకం, మల్బరీ సాగు, వాటి ద్వారా కలిగే లాభాలు, ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకరయ్య, ఉపాధ్యాయులు సీతారాం, అర్పిత, లత, ప్రసన్నతో పాటు రైతులు పాల్గొన్నారు.