హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య కళాశాలకు అదనంగా రూ.41 కోట్లు

VKB: ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.41 కోట్లు మంజూరు చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కృషితో ఈ నిధులు విడుదలయ్యాయి. దీంతో కళాశాల నిర్మాణానికి ఇప్పటివరకు కేటాయించిన మొత్తం రూ.235 కోట్ల నుంచి రూ.276 కోట్లకు చేరింది. భవనాలు, వసతి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.