హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాజ్యాంగ స్ఫూర్తితో దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి'

NRML: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్మల్‌లో BJP ఆధ్వర్యంలో వివేకానంద చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి,అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ దేశ సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. BJP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.