KMR: పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీ, 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం కేసులో పరారీలో ఉన్న అప్పటి పంచాయతీరాజ్ శాఖ ఏఈ వెంకటేష్‌ను పోలీసులు కరీంనగర్‌లో అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయనను జైలుకు తరలించారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఇదే కేసులో మాజీ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ
ఫరీద్‌పేట్ కేసులో ఏఈ అరెస్టు


