హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన వారికి షోకాజ్ నోటీసులు

కాకినాడ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులకు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తప్పుడు వైద్య ధృవపత్రాలిస్తే మెడికల్ బోర్డు విచారణ తర్వాత చర్యలు ఉంటాయన్నారు. 2, 3 విడతల విధులకు ఉద్యోగులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు.