హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జంగంగుంట్ల సర్పంచ్‌గా కొప్పుల నర్సిరెడ్డి ఏకగ్రీవం

ప్రకాశం: కంభం మండలం జంగంగుంట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కూటమి బలపరిచిన అభ్యర్థి కొప్పుల నర్సిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.