SRCL: సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మర్రిపల్లి అమృతకు కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేశారు. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత పరిస్థితిని తెలుసుకున్న కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. వేములవాడ 12వ వార్డులోని 60 గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకోనున్నట్లు అమృత తెలిపారు. ప్రభుత్వం, కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం అందజేసిన కలెక్టర్


