హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూర్గులలో ఎండిపోతున్న వేప చెట్లు

RR: బూర్గులలో వేప చెట్లు ఎండిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారి రాలిపోతుండగా, కొన్ని కొమ్మలు పూర్తిగా ఎండిపోతున్నాయి. మరికొన్ని కొమ్మలు పచ్చగా ఉండటంతో కారణంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావమా.. లేక ఏదైనా తెగులు సోకిందా అనేది తెలియాల్సి ఉంది. అధికారులు పరిశీలించి సమస్యకు కారణం వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.