హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ హాకీ జట్టుకు విద్యార్థిని ఎంపిక

అన్నమయ్య: మదనపల్లెకు చెందిన ఆరోగ్యమాత పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని బి. హర్షితరెడ్డి అండర్‌-14 జాతీయ హాకీ పోటీలకు ఎంపికైంది. హిందూపురంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఫార్వర్డ్ ప్లేయర్‌గా ప్రతిభ చాటింది. త్వరలో గ్వాలియర్‌లో జరిగే జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఆమెను పాఠశాల యాజమాన్యం, హాకీ క్లబ్ ప్రతినిధులు అభినందించారు.