హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టిపాలవుతున్న చాళుక్యుల శిల్ప సంపద

SDPT: చేర్యాల మండలం దొమ్మాట వాగు ఒడ్డున చాళుక్యుల కాలం నాటి సతీశిల, వీరగల్లు, వినాయకుడు, నంది విగ్రహాలు సంరక్షణ లేక మట్టిలో కూరుకుపోతున్నాయి. పురాతన శిల్పాలను వెలికితీసి పురావస్తు శాఖ నిపుణులతో భద్రపరచాలని స్థానికులు కోరుతున్నారు.  అధికారులు వెంటనే స్పందించాలని ఆవేదన వ్యక్తం చేశారు.