జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్విస్ ఆధ్వర్యంలో పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించారు. కలెక్టర్ నిశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జానపద గేయాలు, నృత్యాలు, వీధి నాటకం, పెయింటింగ్, కవిత్వం తదితర పోటీల్లో యువత ప్రతిభ చాటారు. యువతలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను వెలికితీసేందుకు ఉత్సవాలు చక్కని వేదికగా నిలుస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యువ ప్రతిభకు యువజన ఉత్సవాలు వేదిక'


