అత్యవసర ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసం నవంబర్ 30న లోక్సభ, డిసెంబర్ 2న రాజ్యసభను తిరిగి సమావేశపరచాలని కేంద్ర ప్రభుత్వం స్పీకర్, ఛైర్మన్లను కోరింది. ఉభయ సభల సమావేశాలు డిసెంబర్ 3న ముగియవచ్చని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై కీలక బిల్లులు తెచ్చే అవకాశముందనే ఊహాగానాలు నెలకొన్నప్పటికీ, అజెండాపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
వార్తలు
30న లోక్సభ సమావేశాలు పునఃప్రారంభం..!


