KRNL: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్యా రంగాల్లో రాణించాలని జిల్లా యువజన అధికారి ఐజయ్య పిలుపునిచ్చారు. మైభారత్ కర్నూలు ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ కార్యక్రమంలో అవుట్‌డోర్ స్టేడియంలో బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. పరుగు పందెం, షాట్‌పుట్, వాలీబాల్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి: ఐజయ్య


