హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్టిఫికెట్ల ఫైల్ రికవరీ చేసిన పోలీసులు

NTR: కృష్ణలంకలో ఆటోలో మరిచిపోయిన పాస్‌పోర్ట్‌కు సంబంధించిన సర్టిఫికెట్ల ఫైల్‌ను పోలీసులు సీసీ కెమెరాల సాయంతో 20 నిమిషాల్లో గుర్తించారు. ఆటో నంబర్, డ్రైవర్ వివరాలు లేకున్నా సీసీ కెమెరాల ద్వారా వాహనాన్ని గుర్తించి పత్రాలను బాధితురాలికి సురక్షితంగా అప్పగించారు. బాధితురాలి భర్త రెండు రోజుల్లో సింగపూర్ వెళ్లాల్సి ఉండటంతో కుటుంబ సభ్యులు ఊరట చెందారు.