హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి: కలెక్టర్

KRNL: ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో రాజ్యాంగ పీఠికను చదివి అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఆచరించాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.