హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే గేటు వద్ద యువకుడి మృతదేహం కలకలం!

VSP: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ESR కంపెనీ వెనుక ఆర్‌అండ్‌డీ యార్డు రైల్వే గేటు వద్ద జార్ఖండ్‌కు చెందిన కైలాష్ ఘాన్సీ (27) మృతదేహం లభ్యమైంది. అఫ్కాన్స్ సంస్థలో హెల్పర్‌గా పనిచేస్తున్న అతను ఈ నెల 23న మార్కెట్‌కు వెళ్లి అదృశ్యమయ్యాడు. కార్మికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.