హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో రాజ్యాంగ పీఠిక పఠించి ప్రతిజ్ఞ

మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ మహిళా కళాశాలలో 'మేరా భారత్ వికాస్' ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, అధ్యాపకులు రాజ్యాంగ పీఠికను పఠించి ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను గౌరవించాలన్నారు.