హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 72.60 శాతం పోలింగ్ నమోదు

కోనసీమ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 72.60 శాతం పోలింగ్ నమోదైనట్లు కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో 4,71,369 మంది ఓటర్లకు గాను 3,42,198 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలాల వారీగా అత్యధికంగా ఉప్పలగుప్తంలో 79.86 శాతం, అత్యల్పంగా కాట్రేనికోనలో 65.95 శాతం పోలింగ్ నమోదైంది.