హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదిలాబాద్ మున్సిపాలిటీని సందర్శించిన ట్రైనీ IAS అధికారులు

ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీని 14 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు గురువారం సందర్శించి, వివిధ విభాగాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా విధానాలను వారికి వివరించినట్లు మున్సిపల్ ఛైర్మన్ అనూష తెలిపారు. ట్రైనీ అధికారులకు క్షేత్రస్థాయి పాలనపై అవగాహనకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడిందని ఆమె పేర్కొన్నారు.