హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికులకు గుడ్‌న్యూస్

VSP: ప్రయాణికుల సౌకర్యార్థం HB కాలనీ–పాత పోస్టాఫీస్ మధ్య 20ఏ బస్సు సర్వీసును ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. సీతమ్మధార, రామాటాకీస్ మీదుగా ఈ బస్సు నడుస్తుందని తెలిపారు. HB కాలనీ నుంచి ఉదయం 6.15 గంటలకు తొలి సర్వీసు బయలుదేరుతుందని RTC ఆర్‌ఎం అప్పలనాయుడు వెల్లడించారు. ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు గంటకో బస్సు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.