హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమాజ ప్రగతికి యువత నాయకత్వం

TPT: యువతరం నాయకత్వ బాధ్యతలు చేపట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు భరత్ ఎన్. ఆచార్య పిలుపునిచ్చారు. గురువారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న జేసీఐ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెమినార్‌ను ఆయన ప్రారంభించారు. పూర్వీకుల ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ, నవతరం సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని సూచించారు.