UP అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ 'మేము ఏమైనా బిచ్చగాళ్లమా' అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను సున్నితంగా మందలించారు. మసూద్ ఉద్వేగంతో మాట్లాడుతుంటారని పేర్కొంటూ, కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణపై దృష్టి పెట్టాలని ఖర్గే హితవు పలికారు.
వార్తలు
'మేము ఏమైనా బిచ్చగాళ్లమా' వ్యాఖ్యలు.. ఖర్గే రిప్లై


