హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిబంధనలు ఉల్లంఘిస్తే ఇటుక బట్టీలు సీజ్'

PDPL: ఇటుక బట్టీల యజమానులు కార్మిక చట్టాలను తప్పనిసరిగా పాటించాలని, కార్మికులపై వేధింపులకు పాల్పడితే బట్టీలను సీజ్ చేస్తామని కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. బాల కార్మికులకు తావుండకూడదని, కార్మికుల పిల్లలను సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శుల కార్మికుల పూర్తి వివరాలు సేకరించి, అధికారులు తనిఖీ చేస్తారని తెలిపారు.