JGL: బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ బోగ శ్రావణిపై కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ ఖండించారు. రాజకీయ విమర్శలు రాజకీయంగానే చేయాలని, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను సహించేది లేదన్నారు. మహిళా నాయకురాళ్ల గౌరవం కాపాడాలని, ఆరోపణలపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని తెలిపారు.
తెలంగాణ
'మహిళా నాయకురాళ్లపై వ్యక్తిగత దూషణలు సహించేది లేదు'


