న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బంతుల నాణ్యత బాగోలేదని ఆరోపించాడు. కేవలం 20-30 ఓవర్లకే బంతులు మెత్తబడిపోతున్నాయని గిల్ అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా గిల్ వ్యాఖ్యలకు కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. సరిగ్గా బౌలింగ్ చేయకుండా బంతులను నిందిస్తే వచ్చేదేమీ ఉండదని చురకలంటించాడు. అందుబాటులో ఉన్న బంతితోనే విజయమార్గాన్ని కనుగొనాలని సూచించాడు.
క్రీడలు
శుభ్‌మన్ గిల్‌కు కివీస్ కెప్టెన్ కౌంటర్


