హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆయిల్ పామ్ యాజమాన్య పద్ధతులపై అవగాహన'

PDPL: ఎల్‌నినో నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగులో యాజమాన్య పద్ధతులపై గురువారం ఎలిగేడు మండలం లాలపల్లిలో అవగాహన కల్పించారు. జిల్లా ఉద్యానవన అధికారి శ్యాం ప్రసాద్ ఆయిల్ ఫామ్ ప్రాధాన్యత వివరించారు. సబ్సిడీపై వివిధ యంత్ర పరికరాలు లభిస్తాయని సూచించారు. నీటి యాజమాన్యం, మల్చింగ్, ఫర్టిగేషన్ ద్వారా ఎరువుల యాజమాన్య పద్ధతులను శాస్త్రవేత్త డా. భాస్కరరావు వివరించారు.