హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రయాణికులు గమనించాల్సిన రైళ్ల మార్పులు

HYD: మనోహరాబాద్‌ రైల్వే యార్డులో అదనపు రైల్వే మార్గం నిర్మాణ పనులు చేపడుతున్నారు. లైన్ విస్తరణలో భాగంగా జరుగుతున్న ఈ పనుల ప్రభావంతో డిసెంబర్ 14 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయనున్నారు. ఆయా రైళ్లను 60 నుంచి 75 నిమిషాల పాటు నియంత్రించనున్నట్లు ద.మధ్య రైల్వే అధికారులు తెలిపారు.