హైదరాబాద్: 28°C
వార్తలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యానికి అసమ్మతి ఎప్పటికీ బలహీనత కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. విమర్శలను సహనంతో వినే ఓపిక రాజ్యాంగ సంస్థలకు ఉండాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలపై దాడులు చేయడం తగదని హితవు పలికారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నప్పుడే పౌరులకు రాజ్యాంగ ఫలాలు దక్కుతాయని, వివక్ష లేకుండా బలహీనవర్గాల గొంతుక వినిపించాలని ఆయన అభిప్రాయపడ్డారు.