చలి తీవ్రత దృష్ట్యా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి గ్రామ పంచాయతీ పరిధిలో పలు గిరిజన గ్రామాల్లో ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ. 10 వేల విలువ గల బ్లాంకెట్లను గురువారం పంపిణీ చేశారు. చలి నుంచి రక్షణ పొందేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని సంస్థ జిల్లా అధ్యక్షుడు కొమ్ము రాము అన్నారు. పేదలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
గిరిజన గ్రామాల్లో బ్లాంకెట్ పంపిణీ కార్యక్రమం


