హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్ నిశాంతి కృతజ్ఞతలు

ASR: జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదన్నారు. ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని, సాయంత్రం 6.30 నుంచి 7 గంటల మధ్య పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఓటర్లు, సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.