హైదరాబాద్: 28°C
క్రీడలు

రిటైర్మెంట్ ప్రకటించిన U-19 WC హీరో

తమిళనాడు మాజీ కెప్టెన్‌ బాబా అపరాజిత్‌ 32 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. గతంలో భారత అండర్‌-19 ప్రపంచకప్‌ విజేత జట్టులో అపరాజిత్ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే, IPLలో CSK, RPSG జట్ల తరఫున కూడా ఆడాడు. ఇక తన కెరీర్‌లో 102 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 12 సెంచరీలతో 5,199 పరుగులు సాధించాడు.