రెండో టెస్టుకు ముందు రిషభ్ పంత్ న్యూజిలాండ్‌లోని ఓ పార్క్‌లో క్లబ్ క్రికెట్ ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 'హౌజ్ స్వింగర్స్' జట్టు తరఫున బరిలోకి దిగిన పంత్.. 'ది చూసెన్ వన్స్' బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 26 బంతుల్లో 72 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. పంత్ అలా పార్క్‌లో క్రికెట్ ఆడటం చూసి తాను షాక్ అయినట్లు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు.
క్రీడలు
క్లబ్ క్రికెట్ ఆడి ఆశ్చర్యపరిచిన పంత్


