హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ ఇద్దరిని పక్కన పెట్టాల్సిందే: ఆకాశ్ చోప్రా

క్రైస్ట్‌చర్చ్ వేదికగా రేపు భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో రెండు మార్పులు చేయాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించాడు. అన్షుల్ కాంబోజ్ స్థానంలో సిరాజ్, వాషింగ్టన్ సుందర్ స్థానంలో జడేజాను ఆడించాలని అభిప్రాయపడ్డాడు. లేదంటే టీమిండియా గెలిచే అవకాశాలు తక్కువేనని హెచ్చరించాడు. కాగా, WTC ఫైనల్ చేరాలంటే భారత్‌కు విజయం తప్పనిసరి.