భోజనం మధ్యలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందనేది అపోహ మాత్రమేనని పలువురు నిపుణులు చెబుతున్నారు. కొద్దికొద్దిగా నీరు తాగడం వల్ల ఆహారం సులభంగా మింగడానికి, పోషకాల శోషణకు తోడ్పడుతుంది. అయితే, అతిగా నీరు తాగడం వల్ల కడుపు త్వరగా నిండిపోయి, అవసరమైనంత ఆహారం తినలేకపోవచ్చు. దాహం వేసినప్పుడు మితంగా నీరు తాగడమే ఆరోగ్యకరం.
ఆరోగ్యం
భోజనం మధ్యలో వాటర్ తాగుతున్నారా..?


