హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఈ చిట్కాలతో నడుము నొప్పికి చెక్

నడుము నొప్పికి కొన్ని చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంచండి. రోజుకు కనీసం 20 నిమిషాలు నడవండి లేదా తేలికపాటి స్ట్రెచింగ్ చేయండి. బరువైన వస్తువులు ఎత్తేటప్పుడు మోకాళ్లు వంచి ఎత్తండి. మెత్తటి పరుపులకు బదులు నడుముకు ఆసరానిచ్చే పరుపు వాడండి. వేడి లేదా చల్లని కాపడం పెట్టండి. నొప్పి ఎక్కువైతే డాక్టర్‌ను సంప్రదించండి.