రోజంతా ఒకేచోట కూర్చోకుండా మధ్యమధ్యలో 5 నిమిషాలు నడవడం లేదా స్క్వాట్స్ చేయడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు మరింత స్థిరంగా ఉంటాయి. రోజులో ఒకేసారి 45 నిమిషాలు నడవడం కంటే, ఇలా చిన్న విరామాలతో తరచుగా శరీరానికి కదలికలు ఇవ్వడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పని మధ్యలో విరామం తీసుకుని నడవడం మర్చిపోకండి.
ఆరోగ్యం
మంచిమాట: మధ్యమధ్యలో నడవండి


