హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురపాలక పోర్టల్ మొరాయింపు.. ప్రజలకు ఇబ్బందులు

KMR: కామారెడ్డి పురపాలక సంఘాల్లో జనన, మరణ ధ్రువపత్రాలు, ఇంటి అనుమతులు, మ్యుటేషన్ల జారీ ఆలస్యమవుతోంది. పోర్టల్‌లో ఆరు నెలలుగా సర్వర్ సమస్యలు తలెత్తుతుండటంతో వారం నుంచి పక్షం రోజులైనా దరఖాస్తులకు ఆమోదం లభించడం లేదు. అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.