MLG: ఏటూరునాగారం సమీపంలోని జాతీయ రహదారి 163పై జంపన్నవాగు బ్రిడ్జి వద్ద గురువారం భారీ కొండచిలువ కనిపించింది. రెయిలింగ్‌లో చిక్కుకున్న దానిని అటవీ అధికారులు రెస్క్యూ టీం సహాయంతో పట్టుకుని హనుమాన్ నగర్ బీట్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అటవీ మార్గాల్లో వన్యప్రాణుల సంచారంపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
తెలంగాణ
జంపన్నవాగు బ్రిడ్జి వద్ద భారీ కొండచిలువ కలకలం


