హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన సర్పంచ్

BHPL: గోరికొత్తపల్లి(M)కొత్తపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఇవాళ సర్పంచ్ జవ్వాజి రమేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, స్టాక్ వివరాలు, పిల్లల హాజరు శాతాన్ని పరిశీలించారు. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ టీచర్ మాధవి, ఆయా స్వప్నలకు సూచించారు. పిల్లల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.