హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు షీ టీమ్స్ అవగాహన సదస్సు

RR: ఎల్బీనగర్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ నగర్‌లోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరాలు, లోన్ యాప్ మోసాలు, బాల్య వివాహాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, టీ-సేఫ్ యాప్, సీసీ కెమెరాలు, మానవ అక్రమ రవాణాపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో 112కు డయల్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు.