హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీ లావు నివాళులు

PLD: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, గురువారం పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.