హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాము కాటుకు గురై చికిత్స పొందుతూ రైతు మృతి

కరీంనగర్: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వరి కోత పనుల కోసం బావి వద్దకు వెళ్లిన రామంచ బాల్‌రెడ్డి (57) బుధవారం పాము కాటుకు గురయ్యారు. గమనించిన ఆయన తమ్ముడు వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.