హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాన ప్రతిపక్షం అవరోధ్ పక్షంగా మారింది: మోదీ

గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు చేశారు. ఒక రాజకీయ పార్టీ సుమారు 100 సార్లు ఆర్టికల్ 356ని దుర్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం విరోధ్ పక్ష్(ప్రతిపక్షం)గా కాకుండా అవరోధ్ పక్ష్(అడ్డంకులు సృష్టించే పక్షం)గా మారిందని ఎద్దేవా చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు.