ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్‌ను ఉద్దేశించి కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. శరద్ పవార్ 2019లోనే ఎన్డీఏ కూటమిలో చేరి ఉంటే 2022 నాటికి ఆయన రాష్ట్రపతి అయ్యేవారని తెలిపారు. ఎన్డీఏలో కలవాలని తాను పవార్‌ను ఎన్నోసార్లు కోరినట్లు చెప్పారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచే ప్రధాని మోదీకి పవార్‌పై గౌరవం ఉందని, ఆయనను ఆదర్శంగా భావించేవారని వెల్లడించారు.
వార్తలు
NDAలో చేరి ఉంటే రాష్ట్రపతి అయ్యేవారు: కేంద్రమంత్రి


