హైదరాబాద్: 28°C
వార్తలు

కాల్పుల కలకలం.. పోలీసుల అదుపులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉస్మాన్ పూర్ పుష్తా రోడ్డు వద్ద స్పెషల్ స్టాఫ్ పోలీసులు అమన్ గాజీని చుట్టుముట్టారు. నిందితుడిని లొంగిపోవాలని హెచ్చరిస్తుండగా.. పోలీసులపైనే అతను నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో పోలీసులు అతడిపై ఐదు రౌండ్ల ఎదురుకాల్పులు జరిపారు. దీంతో అమన్ జీ కాలిలోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.