హైదరాబాద్: 28°C
వార్తలు

లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి

SRPT: సూర్యాపేట జిల్లా 65వ జాతీయ రహదారిపై మాధవరం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన మహారాష్ట్రకు చెందిన లారీ ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్ బుర్ర పాపారావు (54) అక్కడికక్కడే మృతి చెందాడు. మునగాలకు చెందిన పాపారావు సొంతంగా సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రం నిర్వహిస్తూ, ట్రాక్టర్‌పై బ్రిక్స్ సరఫరా చేసేవాడు.