హైదరాబాద్: 28°C
వార్తలు

SIR తప్పిదాలపై ఈసీ దిద్దుబాటు చర్య

SIR సమయంలో ఏవైనా వివరాలు తప్పుగా నమోదైతే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ఈసీ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లకు లేఖ రాసింది. పేర్లు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఫొటో, బంధుత్వం వంటివి తప్పుగా ముద్రితమైతే ఆ వివరాలను సరిచేసుకునేందుకు ఓటర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఇందుకోసం ఫారమ్-8ను ఉపయోగించాలని సూచించింది.